Surprise Me!

Krishna River Boat Mishap : Chandrababu's Assurance To Victims | Oneindia Telugu

2017-11-14 304 Dailymotion

AP CM Chandrababu Naidu visited Andhra hospital where boat incident victims are getting treatment, he given assurance to them

కృష్ణానది బోటు ప్రమాదాన్ని టీడీపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. అత్యంత దురదృష్ఠకరమైన ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ రిపీట్ అవకుండా.. అదే సమయంలో పర్యాటకులకు భరోసా ఇచ్చేలా సేఫ్టీ వాటర్‌ టూరిజం కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికి తీయగా.. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, సోమవారం నాడు బోటు ప్రమాద ఘటనను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అంతకుముందు హెలికాప్టర్లో ఏరియల్‌ సర్వే చేశారు. బోటు తిరగబడిన ప్రదేశాన్ని, గాలింపు చర్యలను పరిశీలించారు. సహాయ చర్యల విషయమై కృష్ణాజిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.